గండికోట



వికీపీడియా


గండికోట

ఆంధ్ర ప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలంలోని గ్రామం




గండికోట

గండికోట వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగుమండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జమ్మలమడుగు నుండి పడమర దిశగా 14 కి. మీ. దూరంలో ఎర్రమల పర్వత శ్రేణిపై ఉన్నది. పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైనగండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చినది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి. ఈ గ్రామంలో గల చారిత్రక కోట గండికోట ప్రముఖ పర్యాటక కేంద్రం.
గండికోట
రెవిన్యూ గ్రామం

గండికోట is located in Andhra Pradesh
గండికోట
గండికోట
అక్షాంశ రేఖాంశాలు: 14°48′48″N 78°17′05″E / 14.8134°N 78.2848°E Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ కడప జిల్లా
మండలంజమ్మలమడుగు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం4,278 హె. (10,571 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,118
 • సాంద్రత26/కి.మీ2 (68/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08560 Edit this at Wikidata)
పిన్(PIN)516434, 516434 Edit this at Wikidata

గండికోట వద్ద పెన్నానది

చరిత్రసవరించు

గండికోట ఒక ప్రముఖమైన గిరిదుర్గము, దీని చరిత్ర 13వ శతాబ్దము యొక్క రెండవ అర్థభాగములో మొదలవుతుంది. గండికోట కైఫియత్ లో పశ్చిమ కళ్యాణీ చాళుక్య రాజైన ఆహవమల్ల సోమేశ్వరచే మలికినాడు సీమకు సంరక్షకునిగా నియమించబడిన కాకరాజు శా.1044 శుభకృతు నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి (క్రీ.శ. 1123 జనవరి 9) నాడు ఈ కోటను కట్టించెను అని పేర్కొనబడింది.[1] ఐతే ఇదినిజమని నిర్ధారించడానికి మరే ఇతర చారిత్రక ఆధారాలూ లేవు. త్రిపురాంతకము వద్ద గల శా.1212 (క్రీ.శ. 1290) నాటి ఒక శాసనం ప్రకారం, అంబదేవ అనే ఒక కాయస్త నాయకుడు, తన రాజధానిని వల్లూరు నుంచి గండికోట కు మార్చాడని భావిస్తున్నారు. ఉప్పరపల్లె దగ్గర గల శా.1236కు చెందిన ఒక శాసనం ప్రకారం ప్రతాపరుద్రుని సామంతుడు ఒకరు ఈ కోటను జయించాడని, ప్రతాపరుద్రుడు జుట్టయలెంక గొంక రెడ్డిని గండికోటని పాలించడానికి నియమించాడని తెలుస్తోంది. గండికోట విజయనగర సామ్రాజ్య కాలములో ఉదయగిరిమండలము (ప్రాంతము)లోని ఒక సీమకు రాజధానిగా ఉండేది. 16వ శతాబ్దపు రెండవ అర్ధభాగములో గండికోటను పెమ్మసాని నాయకులు తిమ్మానాయుడు, రామలింగనాయుడు విజయనగర రాజుల సామంతులుగా పాలించారు.<[2] విజయనగర సామ్రాజ్యము విచ్ఛిన్నమైనపుడు, పదిహేడవ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్ షాసేనాని మీర్ జుమ్లా కుమార తిమ్మానాయునికి మంత్రి పొదిలి లింగన్న ద్వారా విష ప్రయోగము చేయించి ఈ కోటను స్వాధీన పరచుకొన్నాడు.
వీరి పాలనలో గ్రామాలని మూడు విధాలుగా విభజించారు. బండారువాడ, అమర మరియు మాన్య విభాగాలుగా విభజించారు. ఇందులో బండారువాడ గ్రామాలు చక్రవర్తుల ఆధీనంలో ఉండేవి. మాన్య గ్రామాలు దేవాలయాల , బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి. అమర గ్రామాలు అమరులైన కోట అధ్యక్షుల ఆధీనంలో ఉండేవి. అందమైన లోయలు, ఎటు చూసినా అబ్బురపరిచే కమనీయ దృశ్యాలే ఇక్కడ కన్పిస్తాయి. ఎంతో ఘన చరిత్ర ఈ కోట సొంతం. ఎందరో రాజులు, రాజవంశాల పరాక్రమానికి, నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులకు ఇది నిలువుటద్దం. ఈ కోటను సందర్శిస్తే ఆనాటి రాజుల పౌరుషాలు, యుద్ధాలు, నాటి రాజుల పరిపాలన గుర్తుకు వస్తుంది. దీని పరిసర ప్రాంతాల్లో 21 దేవాలయాలున్నాయి. పడమర, ఉత్తర దిక్కుల్లో పెన్నానది ప్రవహిస్తోంది. కోట నుంచి చూస్తే దాదాపు 300 అడుగుల లోతులో 250 అడుగుల వెడల్పుతో పెన్నానది కన్పిస్తుండడం విశేషం. ఇక్కడున్న జుమ్మామసీదు ఎంతో ప్రాచుర్యం పొందింది. మసీదు ప్రాకారం చుట్టూ లోపల 64 గదులు, బయట 32 గదులుండి ఎంతో ఆకర్షిస్తాయి.
ఎలాంటి నేరాలకైనా కృరమైన శిక్షలు ఉండేవి. చిన్న దొంగతనానికి కాలు, చేయి తొలగించేవారు. రాజద్రోహానికి పాల్పడితే కళ్ళు పీకేసి సూదులు చెక్కిన కర్రతో చంపేసేవారు. పెద్ద దొంగతనాలకు గడ్డం కింద కొక్కెం గుచ్చి వేలాడదీసి చంపేసేవారు.
తాళ్ళపాక అన్నమయ్య ఆహోబిల మఠ సంస్తాపనాచార్యులైన శఠగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను దర్శిస్తూ తిరుమల చేరాడు. అ యాత్రలో అప్పుడు వున్న గండికోట చెన్నకేశవాలయం దర్శించి చెన్నకేశుడిని "చీరలియ్యగదవోయి చెన్నకేశవా! చూడు చేరడేసి కన్నుల వో చెన్నకేశవా" అని స్తుతించాడు.[3]

కోట విశిష్టతలు

జనగణన

విద్యా సౌకర్యాలు

తాగు నీరు

సమాచార, రవాణా సౌకర్యాలు

భూమి వినియోగం

నీటిపారుదల సౌకర్యాలు

ప్రధాన ఉత్పత్తులు

ఇవి కూడా చూడండి

మూలాలు



వికీపీడియా

అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 3.0క్రింద లభ్యం
No comments :

No comments :

Post a Comment